How to book TTD Kalyana Mandapams Online

TTD has introduced devotee friendly services with online facilitation for booking all 259 Kalyana Mandapams of TTD through www. ttdsevaonline.com .

Through the online facility devotees can now book 215 Kalyana mandapams in Andhra Pradesh, 77 in Telangana, 01 in Odisha, 05 in Karnataka and 01 in Tamil Nadu. All the Kalyana Mandapams are equipped with modern facilities to perform social events like Wedding, Thread ceremony, Engagement, Namakaranam, Shastipurti, Anna Prasana, Satyanarayana Vratam,Wedding Reception etc.

HOW TO BOOK

The devotees have to first register themselves in the website
ttdsevaonline.com. Choose State, District and region and enquire about vacancy. Later on upload your Aadhar card, or any other ID card, photo etc. and make payment prescribed online itself.

After completion of the process, the devotees and the concerned supervisors of Kalyana mandapam will get an SMS about the confirmation of booking. When you go for conducting the event you have to show the SMS at the Kalyana mandapam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో 259 టిటిడి కల్యాణమండపాల బుకింగ్‌ సదుపాయం

తిరుప‌తి, 2019 జూన్ 01: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో గల టిటిడి కల్యాణ మండపాలలో 259 క‌ల్యాణ మండ‌పాల‌ను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. ttdsevaonline.com వెబ్‌సైట్‌లో టిటిడి కల్యాణమండపాలను బుక్‌ చేసుకోవచ్చు.

ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ జిల్లాల‌లో 215, తెలంగాణ‌లో 77, ఒడిశాలో 01, క‌ర్ణాట‌క‌లో 05, కేర‌ళ‌లో 01, త‌మిళ‌నాడులో 03 కల్యాణ మండ‌పాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. టిటిడి కల్యాణమండపాల్లో అత్యాధునిక వసతులు కల్పించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం టిటిడి క‌ల్పించింది.

వివాహం, ఉపనయనం, నిశ్చితార్థం, నామకరణము (బారసాల), షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్‌ వంటి శుభకార్యాలకు టిటిడి కల్యాణమండపాలను బుక్‌ చేసుకోవచ్చు.

ఎలా బుక్‌ చేసుకోవాలి..

ttdsevaonline.com వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అనంతరం రాష్ట్రం, జిల్లా, సంబంధిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ఖాళీగా ఉన్న తేదీలను ఎంపిక చేసుకున్న తరువాత ఫొటోతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో ఏదోఒకటి అప్‌లోడ్‌ చేయాలి. కల్యాణమండపాల స్థాయిని బట్టి నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సంబంధిత వ్యక్తులకు, కల్యాణమండపం పర్యవేక్షణ అధికారికి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ను చూపి కల్యాణమండపంలో కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment