Chinna Sesha Vahana Seva, Govindaraja Swamy Brahmotsavalu – 12 May 2019

On the second day morning on Sunday Lord Govinda raja took celestial ride on Chinna sesha vahanam (12 May 2019).

As a part the one going annual brahmotsavams in the ancient temple of Sri Govindaraja Swamy in Tirupati, the processional deity of Govindaraja Swamy was taken around mada streets on five hooded Chinnasesha Vahanam.

The serpent king considered as Vasuki in Hindu mythology grabs the opportunity of being the second carrier among vahana devas of Lord. Devotees chanted Govindanama with religious ecstacy on the sight of Chinnasesha vahanam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం

మే 12, తిరుప‌తి 2019 ; తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 గంటల నుండి 8.30 గంటల వరకు వాహనసేవ జరిగింది. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ వైభ‌వంగా జరిగింది.

చిన్నశేష వాహనం స్వామివారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కుండలినీయోగ సిద్ధించి, సుఖశాంతులతో ఆనందజీవులతారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

"Hindupad Recommends you to Buy Pure Puja Items Online from Om Bhakti". Avail 20% Flat discount on all Puja items.

Write Your Comment