లక్ష్మీదేవి శాశ్వత నిలయం

‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌
దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీపన్నమోస్తుతే’

జ్యోతిని పరబ్రహ్మ స్వరూపం గా, మనోవికాసానికి, ఆనందాని కి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తాం.పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమాన్వితమైన హారాన్ని వారంగా ప్రస్తాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్ద నున్న ఐరావతము అనే ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కి నాశనం చేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు.

దీంతో శాపగ్రస్తుడైన దేవేంద్రుడు రాజ్యాధిపత్యం కోల్పోయి, సర్వసంపదలు పోగొ ట్టుకొని దిక్కుతోచని స్థితిలో దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు దేవేంద్రునికి ఒక సూచన ఇస్తాడు. ఒక జ్యోతిని వెలగించి దానిని శ్రీ మహా క్ష్మి స్వరూపంగా తలచి పూజించమని, ప్రార్ధించమని చెప్తాడు.
మహావిష్ణువు చెప్పిన విధంగా దేవేంద్రుడు పూజించడంతో దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అప్పుడు దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యా న్ని, సర్వసంపదలను పొందుతాడు ఆనందంతో జీవిస్తాడు . ఆ తర్వాత ఒకసారి లక్ష్మీదేవితో తల్లీ నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా ! నీ బిడ్డలు నీ కరుణాపొందే మార్గం లేదా అని ఆ తల్లిని అడుగుతాడు.

అప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి తనను త్రికరణ శుద్దిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనుగుణంగా… మహర్షులకు మోక్ష లక్ష్మి రూపంగా, విజయాన్ని కోరే బిడ్డలకు విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను భక్తి తో ఆరాధిస్తే విద్యా లక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి నన్ను కొలిచేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా వారికి ప్రసన్నురాలనవుతానని దేవేంద్రుని సమాధానం ఇస్తుంది. ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆ తల్లి ప్రసన్నురాలై వారి కోర్కెలు నిరవేర్చుతుంది.

శాశ్వత నిలయం :

గురుభక్తితో దేవతలను, పితృదేవతలను పూజించేవారు.. సత్యం పలికే వారు.. దాన ధర్మాలు చేసేవారు.. భార్యను గౌరవించేవారు.. బ్రాహ్మణుల పట్ల భక్తి చూపేవారు.. పగటిపూట నిద్రపోని వారు.. వృద్ధులు.. బలహీనులు.. అసహాయులైన స్త్రీలు.. పేదవారి పట్ల కరుణగల వారు.. పారిశుద్ధ్యాన్ని పాటించేవారు.. అతిథులకు పెట్టిన తర్వాతే భోజనం చేసేవారు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టులు అవుతారు. వారి ఇళ్లలోనే శ్రీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. పెద్దస్థాయిలో ఉండే అధికారుల.. మంత్రుల ఇళ్లలో మహాలక్ష్మి నివాసముంటుంది. అందుకే ఆయా వ్యక్తుల ముఖాల్లో ఒక విధమైన ఆకర్షణ, కళ ఉంటాయి. దీన్నే లక్ష్మీకళ అంటారు.

అయితే అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్లి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసముండదు. తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీదేవి ఉండదని పురోహితులు అంటున్నారు.లక్ష్మీదేవి సకల సంపదలతోపాటు సౌభాగ్యాన్ని అందించే దేవత. అందుకే సౌభాగ్యవంతులందరూ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మిని అర్చిస్తారు.

శుక్రుడికి ప్రత్యాధి దేవత మహాలక్ష్మీ మానవులకు కళలు అబ్బాలన్నా, బోగభాగ్యాలు ఉండాలన్నా, వాహన యోగం కలగాలన్నా మంచి ఇల్లు, మంచి తిండి, మంచి కళత్రం, అందం వీటన్నిటినీ ప్రసాదించేది శుక్రుడే అని గ్రహించాలి. శుక్రుడు భాగ్యకారకుడు. ఎవరైనా శుక్రుడి అను గ్రహం పొందాలంటే మహాలక్ష్మిని పూజించి తమ కోర్కెలను నిజం చేసుకోవచ్చు.

Write Your Comment