కలలో పాములు

నెరవేరని ఆశల్లో భాగంగా కలులు వస్తాయని ఓ నమ్మకం ఉంది. అయితే కలలు రకరకాలుగా వస్తుంటాయి. మనం ఎక్కువగా ఊహించుకునే వాటి గురించి.. మనం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తామో వాళ్ల గురించి.. పగలంతా ఏ పనిలో నిమగ్నమవుతామో వాటి తాలూకు విషయాలు స్వప్నంలో దర్శనమిస్తుంటాయి. మరి ఎలాంటి సంబంధం లేకుండా.. పాము కలలో వస్తే.. ?
—–> పాములు 12ఏళ్లు పగ పట్టడం వాస్తవమేనా ?
పాములు తిరుగుతున్నట్టు.. చెట్టుకు వేలాడినట్టు.. మనకు దగ్గరగా వచ్చినట్టు.. పాముల గురించి రకరకాల కలలు వస్తుంటాయి. ఇలా పాములు కలలో కనపడితే.. ఏం జరుగుతుందో అని ఉదయాన్నే లేచినప్పుడు చాలా ఖంగారు పడుతుంటారు. కానీ భయపడాల్సిన పనిలేదు. పాములు స్వప్నంలో కనపడితే.. మంచిదని, సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉన్నవాళ్లకే పాములు కలలో కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కలలో పాము కనిపించి.. కాటేసి వెళ్లిపోతే.. ఇకపై ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అలాగే కలలో పాము కనిపించి.. ఏమీ చేయకుండా వెళ్లిపోయినా.. సుఖసంతోషాలతో ఉంటారని అర్థం. అయితే కలలో పాము వెంటాడితే మాత్రం.. మీకు సమస్యలు, కష్టాలు తప్పవని జ్యోతిష్యం చెబుతోంది. ఎలాంటి సమస్యలైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది.
—–> కేవలం మన భారతీయులు మాత్రమే చేసే విచిత్రమైన ఉద్యోగాలు
అసలు పాములు కలలో ఎందుకు వస్తాయి అనే దానిపై రకరకాల అభిప్రాయాలున్నాయి. కొంతమందికి పాములంటే అసహ్యం, భయం ఉంటుంది. తాడు, కట్టె లాంటి వస్తువులు చూసినా.. పాము ఏమో అని భయపడుతుంటారు. మనసులో పాముపై ఉన్న భయం, అసహ్యమే భ్రమ కల్పించి.. కలలోకి వస్తుందట.
కొన్ని సందర్బాల్లో ఎప్పుడూ ఎదురవని.. భయం మనకు కలుగి ఉంటుంది. ఈ ఆకస్మిక భయం పాము రూపంలో కలలోకి వస్తుంది. సమస్యను తీర్చే దారి కనిపించనప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పాము కల వస్తుంది. అలాగే డబ్బు కోసమో, ఇంకేదైనా విషయంలోనో బెదిరింపులకు గురైనప్పుడు… వాటిని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి కలలో పాముగా మారుతుంది.
—–> మార్కెట్లో అమ్ముతున్న విచిత్రమైన గిరిజన ఫుడ్స్ కాబట్టి..
పాము కలలో కనిపించడం అనేది.. భ్రమ మాత్రమే. మనలోని ఆలోచనలు, ఒత్తిడి కారణంగా పాము కనిపిస్తుంది. అన్నింటికంటే.. ఎక్కువగా చాలా మంది పాముకి భయపడతారు. కాబట్టి.. ఇలాంటి కలలు సహజం. దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువగా పాము కలలు రావడం, భయాందోళనకు గురవుతుంటే.. తలస్నానం చేసి శివుడికి పూజ చేయాలి. లేదా.. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు.

Write Your Comment