అధికమాసం, క్షయమాసం, శూన్యమాసం

అధికమాసం

రెండు అమావాస్యలమధ్య రవి సంక్రమణం జరుగకపోతే ఆ చాంద్రమాసాన్ని’అధికమాసం’ అంటారు. ఈ అధికమాసంలో ప్రతిరోజూ చేసుకునే నిత్యకర్మలు మాత్రమే చేసుకోవాలి. శుభకార్యాలు చేయరాదు.

క్షయమాసం

రెండు అమావాస్యల నడుమ రెండు సూర్య సంక్రమణాలు జరిగితే ఆ చాంద్రమాసాన్ని క్షయమాసం అనిపిలుస్తారు. అనగా ఒకే చాంద్రమాసంలో రెండు రాశులలో రవి సంచరిస్తాడన్నమాట.

శూన్యమాసం

రవి మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు చైత్రమాసం, మిథునరాశిలో సంచారిస్తునప్పుడు ఆషాడమాసం, కన్యయందు సంచారిస్తునప్పుడు భాద్రపదమాసం, ధనస్సునందు సంచరిస్తునప్పుడు పుష్యమాసం

పై మాసాలు శూన్య మాసములుగా చెప్పబడుట వల్ల .ఆధిక, క్షయ, శూన్య మాసాలందు శుభకార్యాలు ఎవీ చేయకూడదు.

Write Your Comment