Sri Bugulu Venkateswara Swamy Temple, Chilpur

Sri Bugulu Venkateswara Swamy Temple is located at Chilpur, Stn. Ghanpur Mandal in Warangal District, Andhra Pradesh. This Temple is dedicated to Bugulu Venkateswara Swamy.

Address:
Sri Bugulu Venkateswara Swamy Temple,
Chilpur, Stn. Ghanpur Mandal, Warangal District,
Andhra Pradesh, India,
Pin Code : N/A

Phone Number : N/A
Fax : N/A

Email : N/A
Official Website : N/A

Write Your Comment

1 Comments

  1. Suman Chirra says:

    కలి కల్మష నాశాయ
    కామితార్థ ప్రదాయినే
    చిల్పూరుగిరి నివాసాయ శ్రీనివాసాయ మంగళం’
    …అని కీర్తిస్తే చాలు అప్పుల్లో కూరుకుపోయిన వారికి రుణవిముక్తి కలిగిస్తాడు, భయంతో వణికిపోతున్నవారికి అభయాన్ని ప్రసాదిస్తాడు, చింతల్లో చిక్కుకున్నవారిని ఒడ్డున పడేస్తాడు, కొత్త దంపతులకు కోరిన వరాలిస్తాడు – అంటూ చిల్పూరు గుట్టమీద కొలువైన ‘బుగులు’ వేంకటేశ్వరస్వామి మహత్యాన్ని భక్తులు పరవశంగా చెబుతారు. పేరుకు చిన్న తిరుపతే అయినా, వరాలు గుప్పించడంలో మాత్రం దేవుడిది పెద్దచేయే!

    స్వామిని ‘బుగులు’ వేంకటేశ్వరస్వామిగా పిలవడం వెనుక ఎన్నో ఐతిహ్యాలు. శ్రీనివాస కల్యాణ గాథ సుపరిచితమైందే. భృగుమహర్షి ఉదంతం తర్వాత…లక్ష్మీదేవి అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. ప్రియపత్నిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూలోకానికి వచ్చేస్తాడు. నారాయణవనంలో సంచరిస్తున్నప్పుడు, ఆకాశరాజు పుత్రిక పద్మావతీదేవిని చూసి మనసు పడతాడు. ఎరుకలసాని ఇచ్చిన ధైర్యంతో, వకుళాదేవి నేరుగా ఆకాశరాజు కొలువునకెళ్లి, శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి పెళ్లిచేయమని అడుగుతుంది. రాజు అంగీకరిస్తాడు. ముహూర్తం ఖరారైపోయింది కానీ, చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి లక్ష్మీపతిది. నారదుడి సలహాతో కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడు. ముక్కోటి దేవతల సాక్షిగా వివాహం జరిగిపోతుంది. రుణభారం ఎవర్నీ స్థిమితంగా ఉండనీయదు, ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. ఆ అప్పుల బాధ ఆదినారాయణుడినీ వదిలిపెట్టలేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో, అన్నన్ని వడ్డీలు ఎలా కట్టాలో అర్థం కాక…పరిపరి విధాలుగా ఆలోచిస్తూ…తిరుమల నుంచి బయల్దేరి చిల్పూరు గుట్టదాకా నడుచుకుంటూ వచ్చేశాడట. అలసిసొలసి దగ్గర్లోని గుహలో విశ్రమించాడట. అందుకే ఇక్కడి మూర్తి విశ్రాంత భంగిమలో ఉంటుంది. స్వామి బయల్దేరాడంటే అనుచరగణం మాత్రం అక్కడే ఉంటుందా? దేవదేవుడి వెంట ఆంజనేయుడూ, గరుత్మంతుడూ, ఆళ్వార్లూ కూడా తరలివచ్చారు. భయంభయంగా (గుబులుతో) వచ్చి కొండ గుహలో తలదాచుకోవడంతో ‘గుబులు’ వేంకటేశ్వర స్వామిగా పేరు వచ్చింది. స్థానిక వ్యవహారంలో ‘గుబులు’ కాస్తా ‘బుగులు’గా మారినట్టు ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణకుమారాచార్యుల విశ్లేషణ.

    కీకారణ్యంలో…
    కాకతీయుల కాలానికే ఇక్కడో చిన్న దేవాలయం ఉంది. పూర్వం ఇది దట్టమైన అటవీప్రాంతం. ఇక్కడి చెట్లూ పుట్టలూ మహర్షుల రాకపోకలతో పునీతం అయ్యాయి. ఓ కథనం ప్రకారం…ఆ రుషి బృందానికి స్వామి స్వప్నదర్శనమిచ్చి తాను కొండ మీదున్న గుహలో వెలసినట్టు చెప్పాడు. దీంతో రుషి గణమంతా సూర్యోదయ సమయానికంతా చేరుకుని ‘కౌసల్యా సుప్రజారామ…’ అంటూ మేలుకొలుపుతో ప్రారంభించి ‘జో అచ్యుతానంద…’ అంటూ జోలపుచ్చేదాకా అక్కడే గడిపి తిరిగివచ్చేదట. నేరుగా నారాయణుడి సేవ చేసుకునే అదృష్టం దక్కినప్పుడు, జపతపాలతో పనేముంటుంది? అనంతర కాలంలో, స్థానిక ప్రజలకు వేంకటేశ్వరుడు కలలో కనిపించి తన ఆనవాళ్లు చెప్పాడు. అంతా కలసి ఓ గుడి కట్టారు. అయితే, వయోధికులు స్వామిని చేరుకోవడం గగనంగా ఉండేది. దీంతో గుట్ట కింద వేంకటేశ్వరుడి పాదాలున్న చోట ఇంకో గుడి కట్టారు. చినజీయరు స్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీనివాసుడి పాదాల దగ్గర దీపం అఖండంగా వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిని దర్శించుకుని… మనసులో ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుందని విశ్వాసం. ప్రతి శనివారం మాత్రం, భక్తులు అర్చకులతో కలసి వెళ్లి గుహలోని స్వామికి పూజలు చేసి వస్తారు. స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి ఆలయమూ ఉంది. ‘అప్పులు తీరేలా చూడు దేవరా! రుణ విముక్తుడినై వచ్చి నీ పూజలు చేసుకుంటా…’ అని మనసులో సంకల్పం చెప్పుకుని, ముడుపులు కట్టడం సంప్రదాయం. సంతానం, వివాహం, ఉద్యోగం తదితర మొక్కులతోనూ ముడుపులు కడతారు. ఇక్కడ మూడుముళ్లూ పడితే దంపతులు అన్యోన్యంగా ఉంటారని ఓ నమ్మకం. ఏటా స్వామి సన్నిధిలో ఐదారు వందల వివాహాలు జరుగుతాయి. ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లకు ఈ ఆలయం ప్రసిద్ధి. కానుకలకో ఆడంబరాలకో కరిగిపోయే దేవుడు కాదు ఈ శ్రీనివాసుడు. ‘అన్యధా శరణం నాస్తి’ అన్న శరణాగతి సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్మాలి. ‘అప్పు’డే అపార అనుగ్రహం కురిపిస్తాడు. ఫాల్గుణ శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి దాకా తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

    ఇలా చేరుకోవచ్చు…
    హైదరాబాద్‌-వరంగల్‌ ప్రధాన రహదారిలో… స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో…చిన్నపెండ్యాల ఉంది. గ్రామ ప్రధాన కూడలి దగ్గర ఆలయ ప్రవేశ తోరణం కనిపిస్తుంది. తరిగొప్పుల గ్రామానికి వెళ్లే ఆ ప్రవేశతోరణ మార్గంలో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే దేవస్థానాన్ని చేరుకోవచ్చు. హన్మకొండ ఆర్టీసీ బస్టాండు నుంచి తరిగొప్పుల వెళ్లే బస్సుల్లోనూ ఆలయ సన్నిధికి చేరుకోవచ్చు.

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading