Kalyanotsavam at Tirupati Kodanda Rama Swamy temple on Punarvasu Nakshatram

On the occasion of Punarvasu star, the birth star of Lord Sri Rama, the TTD is organising a grand Kalyanotsavam at local temple of Sri Kodanda Rama Swamy on Friday, 6 March 2020.

The Kalyanotsavam will be held at 11am and interested couple devotees could participate with Rs.500 a ticket and beget blessings, one uttarium, blouse and Anna Prasadam. Devotees participating in Kalyanotsavam should wear traditional dress.

Later at evening a grand procession of Utsava idols of Sri Sita Lakshmana Sametha Sri Kodandaramaswami will be held in mada streets and thereafter taken to Sri Ramachandra Pushkarani for Unjal seva.

ASTOTTARA SATA KALASHABHISEKAM ON MARCH 9

TTD is also organising an Astottara Sata Kalashabisekam at Sri Kodandaramaswami temple on March 9 and devotees with Rs. 50 ticket could participate.

Later in the evening a grand procession of Utsava idols of Sri Sita Lakshmana Sametha Sri Kodanda Rama Swamy will be held in mada streets and thereafter taken to Sri Ramachandra Pushkarani for Asthanam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 6న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం

తిరుపతి, 2020 మార్చి 02: శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 6వ తేదీ శుక్ర‌వారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.

శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

మార్చి 9న అష్టోత్తర శతకలశాభిషేకం –

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 9వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading